Waltair Veerayya 9 Days Total Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ కీలక పాత్రలో నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. ఈ సినిమా ఇప్పటికే 9 రోజుల పాటు ప్రేక్షకులను అలరించింది. అయితే తొమ్మిది రోజులు పాటు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తూ రావడం సినిమాకు వసూళ్ల వర్షం కూడా కురుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమా తొమ్మిది రోజులు పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 88 కోట్ల 37 లక్షల షేర్, 142 కోట్ల 60 లక్షల గ్లాసు వసూళ్లు రాబడితే 8వ రోజు కంటే 9వ రోజు ఇంకా ఎక్కువ వసూళ్లు రాబట్టడం ఏమనార్హం. 9వ రోజు శనివారం కావడంతో వీకెండ్ ఎఫెక్ట్ తో ఈ సినిమా వసూళ్లు దాదాపు కోటి రూపాయలు మేర పెరిగాయి.


ఇక ఈ సినిమా 9వ రోజు నైజాం ప్రాంతంలో కోటి 70 లక్షలు, సీడెడ్ లో 43 లక్షలు, ఉత్తరాంధ్రలోన 95 లక్షలు, ఈస్ట్ గోదావరి 51 లక్షలు, వెస్ట్ గోదావరి 27 లక్షలు, గుంటూరు 29 లక్షలు, కృష్ణ 31 లక్షలు, నెల్లూరు 20 లక్షలు వసూలు చేసి మొత్తం మీద నాలుగు కోట్ల 66 లక్షల షేర్, 7 కోట్ల 45 లక్షల గ్రాస్ వసూలు చేసింది..


ఇక ఈ సినిమా తొమ్మిది రోజులు పాటు కర్ణాటక సహా మిగతా భారతదేశం మొత్తం ఆరు కోట్ల 90 లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో 11 కోట్ల 45 లక్షల వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 106 కోట్ల 72 లక్షల షేర్, 142 కోట్ల 75 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. ఇక  ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 88 కోట్లకే జరిగితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 89 కోట్లుగా నిర్ణయించారు. ఇక అలా ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్  టార్గెట్ పూర్తి చేసి 17 కోట్ల 72 లక్షల లాభాలతో దూసుకుపోతోంది.
Also Read: Jeremy Renner : ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చిన హాక్ ఐ నటుడు.. 30 ఎముకలు విరిగాయన్న జెరెమీ రెన్నెర్


Also Read: Veera Simha Reddy Day 10: 'వీర సింహా రెడ్డి'కి చివరి వీకెండ్.. బ్రేక్ ఈవెన్ పరిస్థితి ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook